కాసిపేట : సాగు చేసుకుంటున్న భూముల్లోకి ( Cultivated lands ) ఫారెస్ట్ అధికారులు(Forest officials ) వచ్చి అటవీ భూమంటూ ఇబ్బందులు పెడుతున్నారని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ సునీల్ కుమార్కు ఆత్మ చైర్మన్ రైతు సత్తయ్య ఆధ్వర్యంలో వేర్వేరుగా పెద్దనపల్లి రైతులు వినతిపత్రం అందజేశారు. ఫారెస్ట్ శాఖ తమ జోలికి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
1977లో రైతులకు లావన్ పట్టా సర్టిఫికెట్లు జారీ చేశారని, అప్పటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్టీ, ఎస్సీలకు అందించిన భూమి అటవీ శాఖదని భయబ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మేడ సమ్మయ్య, మడిపెల్లి తిరుపతి, దేవక్క, ధర్మయ్య, వెంకటస్వామి, తిరుపతి, రామకృష్ణ, నర్సయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.