Arrest | రైతులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఫారెస్ట్ బీట్ అధికారి అరెస్ట్
Arrest | జిల్లాలోని తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తలమడుగు ఎస్హెచ్ఓ డి. రాధిక తెలిపారు.
ఆదిలాబాద్ : జిల్లాలోని తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్( Beat Offier Krishna Nayak ) పై కేసు నమోదు చేసి అరెస్ట్( Arrest ) చేసినట్లు తలమడుగు ఎస్హెచ్ఓ డి. రాధిక తెలిపారు. ఆమె తెలిపినవివరాల ప్రకారం కజ్జర్ల-దేవాపూర్ గ్రామాల మధ్య రహదారి ఇరువైపులా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్‌కు రైతులు తమ పొలాల్లోని పంట అవశేషాలను తగులబెట్టిన సమయంలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి కొంత నష్టం వాటిల్లిందని వివరించారు.
దీనిని ఆసరాగా చేసుకున్న నిందితుడు కృష్ణ నాయక్, రైతులను బెదిరిస్తూ మొక్కలకు జరిగిన నష్టానికి పరిహారంగా రూ.1,50,000 ఇవ్వాలని రైతులు చింతలపెల్లి జైభరత్ రెడ్డి, తాండ్ర మహేష్, తాండ్ర నర్సింహులు, యెల్మ రఘువరన్ రెడ్డిని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తానని బెదిరించాడని పేర్కొన్నారు.
బెదిరింపులకు భయపడి చింతలపెల్లి జైభరత్ రెడ్డి రూ.25 వేలు, యెల్మ రఘువరన్ రెడ్డి రూ.10వేలు, తాండ్ర మహేష్ రూ.7,500, తాండ్ర నర్సింహులు రూ.7,500 చొప్పున మొత్తం రూ.50వేలు, నిందితుడికి ఇచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి కృష్ణ నాయక్‌ను అరెస్ట్ చేసినట్లు రాధిక తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి హోదాను దుర్వినియోగం చేసి ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

