గోదావరిపై ఫిషరీస్ కారిడార్
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ వరకు సుమారు 175 కిలో మీటర్ల మేర గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులను అనుసంధానిస్తూ ‘ఫిషరీస్ కారిడార్' ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, దేశంలోనే ఇది తొలి ప్రయోగమవుతుం దని ఆ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ పేర్కొన్నారు.
- దేశంలోనే తొలి ప్రయోగం
- ఓసీలు, క్వారీల్లో ఆక్వా కల్చర్
- మత్స్యకారులకు ఆధునిక పరికరాలు
- అందుబాటులోకి ప్రత్యేక హెల్ప్‌లైన్ 90444 80333
- విలేకరుల సమావేశంలో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ రవీందర్
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 2 : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ వరకు సుమారు 175 కిలో మీటర్ల మేర గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులను అనుసంధానిస్తూ ‘ఫిషరీస్ కారిడార్’ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, దేశంలోనే ఇది తొలి ప్రయోగమవుతుం దని ఆ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు నిల్వలను వెలికితీసిన అనంతరం వదిలేసిన ఓపెన్ కాస్టు గనులు, క్వారీల్లో ఆక్వాకల్చర్ టూరిజం (అలంకార చేపల పెంపకం) ఏర్పాటు చేసేందుకు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కారిడార్ ఏర్పాటైతే వేలాది మందికి జీవనోపాధి కలుగుతుందన్నారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ (90444 80333) ఏర్పాటు చేస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ వరకు సుమారు 175 కిలో మీటర్ల పొడవునా గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్టులను అనుసంధానం చేస్తూ ‘ఫిషరీస్ కారిడార్’ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని ఆ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అ న్నారు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు మొట్ట మొదటిసారిగా వచ్చి శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి పాటుపడుతున్నారని, ఇం దులో భాగంగానే గోదావరి నదిపై ఉన్న నీటి వనరులను ఉపయోగించుకొని ప్రత్యేక మత్స్య అభివృ ద్ధి మండలి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నార ని, ఇది దేశంలోనే ఒక వినూత్నమైన తొలి ప్రయోగమన్నారు. దీని ద్వారా మత్స్యకారులకు అదనంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కారిడార్ ఏర్పాటుతో 25 వేల మత్స్యకారులకు అదనంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని, మరో 10 వేల మంది మహిళలకు కూడా ఉపాధి లభిస్తుందని, పరోక్షంగా మరో 45 నుంచి 50 వేల మంది జీవనోపాధి కలుగుతుందన్నారు. అంతేగాకుండా యేటా కోట్లాదిరూపాయల విలువైన చేపలను ఉత్పత్తి చేయగలుగుతామన్నారు. దీంతో స్థానికంగానే చేపలను శుద్ధి చేసేందుకు ఫిష్ ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్ పద్ధతులను అనుసరించడం ద్వారా ఇక్కడ చేపల ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతి చేసే అవకాశముంటుందన్నారు.
ఓసీలు, క్వారీల్లో ఆక్వాకల్చర్..
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, పెద్దప ల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో పూర్తి స్థాయిలో బొగ్గు నిలువలను వెలికితీసిన అనంతరం వదిలేసిన ఓపెన్ కాస్టు గనులు, బండ క్వారీల్లో చేపలను పెంచేందుకు స న్నాహాలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆక్వాకల్చర్ టూరిజం (అలంకార చేపల పెంపకం) ఏ ర్పాటు చేసేందుకు అన్వేషిస్తున్నట్లు ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అన్నారు. జార్ఖండ్ రా ష్ట్రంలోని రాంచి తదితర కోల్‌బెల్ట్ ప్రాంతాల్లో అ క్కడి కోలిండియా సంస్థ నిర్వహించిన ఓసీ గనుల్లో చేపలను పెంచే ప్రయత్నాలు ఫలించాయన్నారు.
మత్స్యకారులకు ఆధునిక పరికరాలు..
రాష్ట్రంలోని జలాశయాల్లో చేపల వేటకు సంబంధించి ఆధునిక విధానాలు, వినూత్నమైన పరికరాలను మత్స్యకారులకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తుందని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. మత్స్యకారులు వినియోగిస్తున్న థర్మోకోల్‌తో తయారు చేసిన తెప్పలకు బదులుగా సూర్యరష్మీ సోలార్ ఇంధనంగా వినియోగించుకొని నడిచే మర పడవలను సీఎం కేసీఆర్ చొరవతో అందుబాటులో తీసుకువచ్చేందు ప్రయత్నం చేస్తున్నామన్నారు. గడిచిన ఎనిమిదేండ్లలో వందలకోట్ల ఖర్చుతో ఉచిత చేప పిల్లలు పంపిణీ పథకాన్ని అమలు చేయడం ద్వారా మత్స్యకారులకు ఆదాయం పెరిగిందన్నారు.
హెల్ప్‌లైన్ ఏర్పాటు..
ఉచిత చేప పిల్లల పంపిణీని సక్రమంగా చేయడంలో స్థానిక మత్స్యకార సొసైటీలు, లబ్ధిదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ కోరారు. ఇందుకోసం దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఒక ప్రత్యేక హెల్ప్‌లైన్ (90444 80333) ఏర్పాటు చేశామన్నారు. దీనిని మత్స్యకారులు సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా ప్ర మోటర్ కే చిన్నయ్య, బీ బానేష్, జీ కొమురయ్య, వివిధ మత్స్య, గంగపుత్ర, ముధిరాజ్, ఇతర అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

