తాండూర్ : అనారోగ్యంతో సంవత్సరం క్రితం మృతి చెందిన తాండూర్‌కు చెందిన ఫోటో గ్రాఫర్ పంబాల రమేష్ ( Photographer ) కుటుంబానికి ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ కుటుంబ భరోసా నుంచి రూ. 10 వేలు ఆర్థిక సాయం అందించారు. గత సంవత్సరం రూ.1,60 లక్షలు అందించగా వారి ఇద్దరు మైనర్ పిల్లల చదువు కోసం రాష్ట్ర అసోసియేషన్ నుంచి వచ్చిన రూ.10 వేలను ఆదివారం అందజేశారు.
ఈసందర్భంగా మంచిర్యాల జిల్లా కోశాధికారి ముక్కెర శ్రీనివాస్, కుటుంబ భరోసా ఇన్చార్జి నూనె సురేష్ మాట్లాడుతూ తమ సభ్యుడు అకాల మరణం చెందాడం బాధకరమని , వారి కుటుంబాన్నికి చేదోడు,వాదోడుగా ఉండేందుకు తమ వంతు సహాయసహకారాలు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు రాజబాబు, బెల్లంపల్లి అధ్యక్షుడు ఆకుల వేణు, మిత్ర వేణు, తాండూర్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, శోభన్, రుకుం ప్రసాద్, శివ, బెల్లంపల్లి, తాండూర్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.