చకచకా..
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాత ర పురస్కరించుకొని నాగోబా వనంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పారిశుధ్య, పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేపడుతున్నారు.
- ప్రభుత్వం ఆధ్వర్యంలో వేగంగా నాగోబా పనులు
- సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిమగ్నం
- ఆర్డబ్ల్యూ ఎస్ ఆధ్వర్యంలో తాత్కాలిక స్నానపు గదులు
- ట్యాంకు నుంచి పైప్లైన్ ఏర్పాటు
ఇంద్రవెల్లి, జనవరి 9 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాత ర పురస్కరించుకొని నాగోబా వనంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం పారిశుధ్య, పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేపడుతున్నారు. ఎఫ్బీవో జ్యోతి ఆధ్వర్యంలో నాగోబా వనం ముఖద్వారం, చెట్టుకు ఏర్పాటు చేసిన కంచెలు, జాలీలకు రంగులు వేసే పనులు చేశారు. నాగోబా వనంలో పేరుకుపోయిన చెత్తతో పాటు ఎండిన పిచ్చిమొక్కలు తొలగించారు. ముఖద్వారానికి రంగులు వేసి బోర్డుపై నాగోబా వనం అని పెయింటింగ్ చేయిస్తున్నట్లు ఎఫ్బీవో జ్యోతి తెలి పారు. సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సౌకర్యాల కల్పన
ఈ నెల 21న నాగోబా జాతరకు తరలివచ్చే భక్తులతో పాటు మర్రిచెట్ల వద్ద మూడు రోజులు బసచేసే మెస్రం వంశీయులకు అన్ని రకాల సౌక ర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాగోబా ఆలయ పరిసరాల తో పాటు మెస్రం వంశీయులు మూడు రోజులు బసచేసే మర్రిచెట్ల ప్రాంతంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక స్నానపు గదులు ఏర్పాటు చేశారు. ట్యాంకు నుంచి వృథాగా వెళ్లే నీరు పైపుల ద్వారా బయటకు పంపించే పనులు చేస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు దగ్గు రుండి పనులు చేయిస్తున్నారు. ఈ కార్యక్రమం లో డీఈ శ్రీనివాస్, ఏఈ భానుకుమార్, సర్పం చ్ మెస్రం రేణుకానాగ్నాథ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

