కడెం, జూలై 2 : నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనులు నెమ్మదిగా సాగుతుండడంతో ఆ యకట్టు రైతులు, గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 11వ నంబ ర్ గేటు కౌంటర్ వేటు రోపు చేంజింగ్ పనులు పూర్తి కాకపోవడం, ప్రధాన కాలువ తూములు మూడు సెంటర్లు, నూతన మోటార్లు ఏర్పాటు చేయకపోవడం, స్పిల్ వే లీకేజీల మరమ్మతులు చేపట్టకపోవడం, నూతనంగా ఏర్పా టు చేస్తున్న ట్రాస్ ర్యాక్ గేట్స్ బిగించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఎడ మ కాలువ తూములకు గేట్స్ లే నందున ఆ వరద ప్రవాహానికి ప్రాజెక్ట్ కింది ప్రాంత గ్రామాలు ముంపునకు గురై పరిస్థితులు ద యనీయంగా మారుతాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాస్ ర్యాక్ గేట్స్ మధ్యలో గ్యాప్‌లు రెండు లేదా మూడు ఇంచులు గ్యాప్ ఉండడం వ ల్ల వరదలకు వచ్చే చెత్త, కర్రలు అక్కడే త ట్టుకొని ఎడమ కాలువకు నీటి విడుదలకు అవకాశం ఉండదని, ఆ గ్యాపుల పెంపుపై పునరాలోచించాలని రైతులు కోరుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేసేలా పర్యవేక్షణ నిర్వహించాలని రైతులు, ముంపు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కడెం ప్రాజెక్ట్ వెళ్లే ప్రధాన దారి పూర్తిగా గుంతలమయంగా మారింది. అధికారులు అదే గుంతల మీదుగా వెళ్తున్నారే తప్ప రోడ్డు బాగు చేసేందుకు కృషి చేయకపోవడం బాధాకరమని స్థానికులు మండిపడుతున్నారు. రహదారిని మెరుగుపర్చాలని ప్రభుత్వానికి స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రాజెక్ట్ ఇరిగేషన్ అధికారులు మాట్లాడుతూ.. రెండు రోజుల్లో తూముల షెట్టర్లు బిగిస్తామని, ట్రాస్ ర్యాక్ గేట్స్ ఏర్పాటు చేయడంలో కొంత అలస్యం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్ట్ 11వ నంబర్ గేటు కౌంటర్ వేట్ మరమ్మతులు ఈ రోజు రేపటి లోపు పూర్తి చేస్తామని, స్పిల్ వే లీకేజీల పనులు పూర్తి చేస్తామని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.