తానూర్ : ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా కాని ప్రభుత్వం యూరియా సరఫరాలో ( Urea Supply) నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం 9 వందల యూరియా బస్తాలు వచ్చాయన్న సమాచారం తెలుసుకొని తానూర్ హంగిర్గా సొసైటీ ( Hangirga Society ) కార్యాలయం వద్ద మహిళలు ,అన్నదాతలు బారులు తీరారు .
బయట మార్కెట్లో యూరియా లేకపోవడంతో రైతులు ప్రభుత్వం అందించే యూరియా పైనే ఆశలు పెట్టుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో విరివిగా లభించిన యూరియా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరిపడా యూరియా రావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.