తాండూర్ : ఉపాధి హామీ పనులు నిర్వహించే స్థలాల వద్ద కూలీలకు ( EGS Workers ) మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూ( CITU ) మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారం డిమాండ్ చేశారు. మండలంలోని తాండూర్ గ్రామపంచాయతీ
పరిధిలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రదేశాల వద్దకు వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ యూనియన్ నాయకులు శనివారం వెళ్లి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాజారాం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కూలీలకు ఐ టెస్ట్ పేరు, ఆన్లైన్ విధానంతో ఉపాధి పథకాన్ని నీరు గార్చే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. పని స్థలాల్లో సిగ్నల్ సరిగా లేకపోవడంతో కూలీల ఫోటోలు తీయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.
విబిజి రాంజీ పథకం చట్టాన్ని తీసుకురావడంతో ఫీల్డ్ అసిస్టెంట్లకు, ఉపాధి కూలీలకు నష్టం జరిగే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో దుర్గం భాగ్య, దాగం సుమ, డి స్వప్న, ఎం రాజేశం, మంగ, జంశెట్టి రవీందర్, దుర్గం సంగీత, లింగాల లక్ష్మి, రాజమ్మ, ఇప్ప రేవతి, సురుపత్తుల నందు, మోత్కుల రమేష్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.