కోటపల్లి : మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలను ( Eye Camp ) నిర్వహించారు. మంచిర్యాలకు చెందిన పవన్ ఆప్టికల్స్ సహకారంతో శంకర్పూర్, శెట్పల్లి, బావనపల్లి, పంగిడిసోమారం గ్రామస్థులకు కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు.
కంటి సమస్యలతో బాధపడుతున్న 43 బాధితులను గుర్తించి వారికి కంటి శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు సూచించారు. ఈ సందర్భంగా కోటపల్లి ఎస్సై రాజేందర్( SI Rajendhar ) వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య పరీక్షలకు హాజరైన వారితో మాట్లాడారు. పోలీసులు ప్రజాసేవ కోసమే పనిచేస్తున్నారని, ఉన్నతాధికారుల ఆదేశాలతో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు.