తాండూర్ : రోడ్డు భద్రత నియమాల ( Road safety rules) పై అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని తాండూర్ ఏఎస్సై ఉస్మాన్ అలీ( ASI Usman Ali ) అన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత బృందం సభ్యులు బుధవారం తాండూర్ ఐబీలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.
రహదారుల భద్రత అనేది ఒకరి బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, వేగ పరిమితులకు లోబడి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, మధ్యం సేవించి వాహనం నడపరాదని అన్నారు. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ మాట్లాడవద్దని కళాజాత సభ్యులు పాటలు, నృత్య రూపకంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో కళాజాత బృందం టీం లీడర్ సల్లూరి కిష్టయ్య, సభ్యులు కొప్పర్తి సురేందర్, బీర్పూర్ శ్రీనివాస్, కొప్పర్తి రవీందర్, కుమ్మరి శ్రావణ్ కుమార్, గొల్లపల్లి శిరీష, వావిలాల నాగలక్ష్మి, కాసిపేట సంతోష్, లింగంపల్లి రాజేష్, పోలీస్ సిబ్బంది, గ్రామస్థులు, డ్రైవర్లు పాల్గొన్నారు.