జైనూర్ : ప్రతి పల్లెల్లో అర్హులైన వారందరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాల్ రాజ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మానిగూడ గ్రామాన్ని సందర్శించి టీకా వేసుకున్న వారి వివరాలను పరిశీలించారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో టీకా ఎందుకు వేసుకోలేదని ప్రజలను అడిగారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఈ నెల 10వ తేదీలోపు 18 సంవత్సరాలు దాటిన వారందరు వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు. అనంతరం గ్రామంలో మరుగుదొడ్లు, రహదారిని పరిశీలించి శుభ్రత పాటించడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
గ్రామాలో ప్లాస్టిక్ నిషేదం పాటిస్తూ పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తాసీల్దార్ సాయన్న, ఎంపీడీవో ప్రభుదయా, వైద్యాధికారి జితేంద్రరెడ్డి, సర్పంచ్, గ్రామపటేల్, కార్యదర్శి, అంగన్వాడీ టీచర్ తదితరులు పాల్గొన్నారు.