ఎదులాపురం : పోలీస్ స్టేషన్కు వచ్చే, పోలీస్ స్టేషన్కు కేటాయించిన ప్రతి ఒక్క ఫిర్యాదును ( Complaint ) కచ్చితంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ (SP Akhil Mahajan) సిబ్బందికి ఆదేశించారు. సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను జిల్లా ఎస్పీకి వివరించారు.
సమస్యలను విన్న జిల్లా ఎస్పీ త్వరితగతిన పూర్తి చేసి పరిష్కరించాలని ఫోన్ ద్వారా సిబ్బందికి ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 40 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. మోసం జరిగిన వెంటనే సరైన దర్యాప్తును పూర్తి చేసి సంబంధిత వారిపై కేసులను నమోదు చేయాలని సూచించారు. బాధితుల సమస్యలను పరిష్కరించినప్పుడే జిల్లా పోలీసుల పట్ల గౌరవం, నమ్మకం మరింత పెరుగు
తుందని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల కూడా సమాన రీతిలో వ్యవహరిస్తూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.