ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/ఇచ్చోడ, జూన్ 20 : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మం డలంలోని పొన్న గ్రామానికి చెందిన ఆదర్శ రైతు పాండురంగ్ పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతోనే మార్కెట్ యార్డులో పంట కుప్ప వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకొన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) అన్నారు. శనివారం పొన్నలో ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్, కోవ లక్ష్మీ, కౌశిక్‌రెడ్డి, సంజయ్, ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఖానాపూర్ ని యోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్, ఇతర నాయకులతో కలిసి రైతు పాండురంగ్ కు టుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు. రైతు పంటను కొనుగోలు చేయకుండా లో డింగ్ కోసం మార్కెటింగ్ సిబ్బంది క్వింటాకు రూ.50 లంచం డిమాండ్ చేశారని అన్నారు. రైతు జొన్న కుప్ప ఇంకా మార్కెట్ యార్డులో నే ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం జొన్నలకు క్వింటాకు రూ.3720తోపాటు మీద నుంచి రూ.500 కలిపి రూ.4,200 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులు ప్రైవేటు వ్యాపారులకు క్వింటాకు రూ.2 వేలకు అమ్ముకొనే దుస్థితి తీసుకొచ్చిందన్నారు. రైతు పాండురంగ్ భార్యను రుణమాఫీ అయిందని అడిగితే రూ. ఒక లక్షకు పైగా లోన్ ఉంటే కాలేదని చెప్పారని, రైతుబంధు పడిందా? అని అడిగితే పడలేదన్నారని, ఇంకా ఏమైనా సాయం అందిందా? అని అడిగితే నా భర్త విషం తాగి మార్కెట్ యార్డులో పడి ఉంటే పట్టించుకొనే వాడు లేడని లేదని అని చెప్పారని పేర్కొన్నారు. అధికారులు, హాస్పిటల్ వాళ్లకు ఫోన్ చేసినా ఎవరూ రాలేదని, చివరకు తండ్లాడి, తండ్లాడి అక్కడే చనిపోయాడని, జొన్న కుప్పల మీద కూలిపోయాడని విలపించిందన్నారు.
పాండురంగ్ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టం..
ఆత్మహత్య చేసుకున్న పాండురంగ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని కేటీఆర్ హెచ్చరించారు. పాండురంగ్ ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నారని, నేను ఆ కుటుంబానికి మాట ఇచ్చినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం మొడలు వంచైన సరే మీకు పరిహారం ఇప్పిస్తామని చెప్పానని, ప్రభుత్వం పాండురంగ్‌తో కుటుంబానికి రూ.25 లక్షలు ఇచ్చి తీరాల్సిందేనని సూచించారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా పంటలు కొనకపోవడం వల్ల, ప్రభుత్వం కావాల్చుకొనే పంటల కొనక ఎగ్గొట్టడం వల్ల, తప్పించుకొనే ధోరణి అవలంబించడం వల్లనే రైతులు మార్కెట్ యార్డుల్లో విషం తాగి చనిపోతున్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని రెండు సంవత్సరాల తర్వాత కేసీఆర్ రైతులకు కండ్లలో పెట్టి చూసుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్ తరఫును రైతు కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఓరగంటి పెంటన్న, రోహిదాస్, సూర్యకాంత్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కేటీఆర్ సార్‌కు కృతజ్ఞతలు..
మా కుటుంబానికి పెద్ద దిక్కయిన మా నాన్నను కోల్పోయాం. మా నాన్న మార్కెట్ యార్డుకు 35 క్వింటాళ్ల జొన్నలు తీసుకెళ్లిండు. అక్కడ లా ట్ నంబర్ ఇచ్చినప్పుడు రైతులకు సంబంధం ఉండదు. కానీ.. మార్కెట్ వాళ్లు క్వింటాకు రూ.50 చొప్పున ఇవ్వకపోవడంతో లోడ్ వేయలేదని మా నాన్న చెప్పారు. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందుతాగి సచ్చిపోయిండు. మా చదువులు, మా ఇల్లు ఎలా గడుస్తదో అని భయంగా ఉంది. బీఆర్ఎస్ నాయకులు, కేటీఆర్ సార్ అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు.
– మనీష, శిరీష, శ్రీమన్(పాండురంగ్ కూతుళ్లు, కొడుకు)
కనీసం కాంగ్రెసోళ్లు పరామర్శించలేదు
నా భర్త పాండురంగ్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరు పరామర్శించడానికి రాలేదు. అధికారంలో లేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్నతోపాటు ఎమ్మెల్యేలు మమ్మల్ని పరామర్శించి ఆత్మైస్థెర్యం కల్పించారు. మా ఆర్థిక పరిస్థితి తెలుసుకొని తక్షణ సహాయంగా రూ.3 లక్షలు అందజేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని, పట్టించుకుంటే నా భర్త ఆత్మహత్య చేసుకొపోయేది.
– నుగూరే సునీత, పాండురంగ్ భార్య, పొన్న గ్రామం.