Voter list | ఓటరు జాబితాలో తప్పులను సవరించాలి : బీఆర్ఎస్ నాయకుల డిమాండ్
Voter list | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం(బి) గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా లో తప్పుల సవరణ పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
కాసిపేట : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం(బి) గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా ( Voter List ) లో తప్పుల సవరణ ( Correction ) పై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు( BRS Leaders) ఆరోపించారు. తప్పులపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
సోమగూడెం బీఆర్ఎస్ నాయకులు కే రాంచందర్ ( Ramchander ) ఓటరు జాబితా తప్పులపై గురువారం వివరాలను వెళ్లడించారు. గతంలో పంచాయతీల్లో పెట్టిన ఓటరు జాబితాలో 43, 44 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అనేక లోపాలున్నాయని ఆరోపించారు. సుమారు 300 మంది ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, డబుల్ ఉన్న వారివి ఓటరు జాబితాలో పేర్లు ఉన్నాయని ఫిర్యాదులు చేశానని గుర్తు చేశారు. దీనిపై సవరణ చేయకుండా పాత జాబితాలనే ఉంచుతున్నారని ఆరోపించారు.
ఓటర్ల జాబితాలో సవరణకు దరఖాస్తులు చేసుకోవాలని ఎన్నికల అధికారులు గురువారం నోటిఫికేషన్ ఇవ్వగా కనీసం సోమగూడెం పంచాయతీలో పాత ఓటరు జాబితా కూడా అందుబాటులో ఉంచలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు సోమగూడెం గ్రామ పంచాయతీలోని పోలింగ్ స్టేషన్ 43, 44 లో ఓటరు జాబితాలపై విచారణ జరిపి తప్పులను సవరణ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

