ఆదిలాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో యువతను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సమైక్య పాలనలో యువకులు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాలకు నోచుకోలేదు. ప్రతిభ ఉన్న ఉన్నత చదువులు చదువుకోలేక, ఉద్యోగాలు సాధించలేక కూలీ, ప్రైవేట్ కంపెనీల్లో చిరు ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం యువత బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నది. కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా పీజీ వరకు చదువుకునే అవకాశాలను కల్పిస్తున్నది. డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇతర డిప్లమా కోర్సులు, వ్యవసాయ కళాశాలలు, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేసి వారు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సాహం అందిస్తున్నది.
యువత స్వ యం ఉపాధి పొందేలా స్కిల్ డెవలప్మెంట్ కో ర్సుల్లో శిక్షణ ఇస్తున్నది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు పోయే వారికి విదేశీ విద్యానిధి పథకం లో భాగంగా ఒక్కొక్కరికి రూ.20 లక్షల సాయం అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల ఆధ్వర్యఃలో యువకులు స్వయం ఉపాధి యూ నిట్లు నెలకొల్పుకోవడానికి అవసరమైన ఆర్థిక సా యం అందజేస్తున్నది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ఉచిత శిక్షణ, స్కాలర్షిప్లు అందజేస్తున్న ది. సర్కారు అందిస్తున్న సాయంతో విద్యార్థులు గ్రామీణ, పట్టణ ఉన్నత విద్యను అభ్యసిస్తూ, ఉద్యోగాలు సాధించి ఉపాధి పొందుతున్నారు.
రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ను అధికారంలో రావడానికి యువత తమ సహకారం అందిస్తున్నారు. పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా గులాబీ పార్టీలో చేరుతున్నారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని అభ్యర్థులు ఎమ్మెల్యే జోగు రామన్న, జాదవ్ అనిల్ సమక్షంలో వేలాది మంది యువకులు గులాబీ కండువా కప్పుకున్నారు.
పది సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు ఎంతగానో ప్రయోజనం చేకూర్చాయని యువకులు అంటున్నారు. 60 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమను పట్టించుకోలేదని, బీజేపీ నాయకులు విద్వేషాలను రెచ్చగొట్టి యువతను వాడుకోవడం తప్ప వారు ఏమి చేయరని యువకులు అంటున్నారు. కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి చేస్తామని చెబుతున్నారు. తమ మొదటి ఓటు బీఆర్ఎస్కు వేస్తామని ఓటరు జాబితాలో కొత్తగా తమ పేర్లు నమోదు చేసుకున్న యువకులు అంటున్నారు.
విద్యార్థుల చదువులకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐదో తరగతిలో ప్రవేశం పొంది డిగ్రీ వరకు ఉచితంగా చదువుకునే అవకాశాలు లభిస్తున్నాయి. ఇంటర్లో ఎంసెట్, ఐఐటీ- జేఈఈ, నీట్ కోచింగ్‌లు ఇస్తున్నారు. దీంతో ప్రతిభగల విద్యార్థులు తమ బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకునే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఉద్యోగావకాశాలు బాగా ఉన్న కోర్సులు ప్రవేశపెట్టి యువకులకు తొందరగా ఉపాధి కల్పిస్తుంది. – రోషన్, ఆదిలాబాద్