కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా ఎల్టా ( ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్) ఆధ్వర్యంలో మండల స్థాయి పోటీలు నిర్వహించారు. ఇంగ్లిష్ ఒలింపియాడ్ ( English Olympiad ) , ఎడ్యుక్వెస్ట్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ కనభరిచారు.
ఆంగ్ల భాషతో వ్యక్తిగత ఎదుగుదల, విజయం, ప్రపంచంతో పోటీకి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎల్టా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సి. బాడ్జి పేర్కొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి, వారిలో భాషాభివృద్ధిని పెంపొందించడానికి, ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి అవకాశాలు కల్పించడానికి ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు.
ఈ పోటీలలో ఇంగ్లిష్ ఒలింపియాడ్ జూనియర్ కేటగిరీలో ఏ సాత్విక ధర్మారావుపేట్, బి. వర్షిత , సీనియర్ కేటగిరీలో ఎస్.అవంతిక , జి. శ్రీవాస్తవ మోడల్ స్కూల్, ఎడ్యుక్వెస్ట్ జూనియర్ కేటగిరీలో జి. వైష్ణవి , ఎన్. సుజిత్ కుమార్ ( మోడల్ స్కూల్), సీనియర్ కేటగిరీలో సయ్యద్ ఈషా , ఎస్. సంజన మోడల్ స్కూల్ విద్యార్థులు గెలుపొందారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం అన్నం రమణారెడ్డి, ఎల్టా మండల కన్వీనర్ డి. పుష్పలత, ఆంగ్ల ఉపాధ్యాయులు అరుణ కుమారి, వెంకటేశ్వర స్వామి, అనిత, నిర్మల, సరిత తదితరులు పాల్గొన్నారు.