ఖానాపూర్ రూరల్, నవంబర్ 24 : ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో ఖానాపూర్ నియోజ కవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. ఖానాపూర్ మండ లంలోని 24 గ్రామ పంచా యతీల్లో శుక్రవారం ఎన్నికల ప్రచా రం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఆయనకు డప్పు చప్పుళ్లు, మంగళహారతులు, పటాకులు కాలుస్తూ స్వాగతం పలికారు. గొల్ల కుర్మలు గొర్రె పిల్ల గొంగడితో ఎమ్మెల్యే అభ్యర్థికి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఒక్కసారి అవకాశం ఇస్తే ప్రతి గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. గెలువ గానే 500 మంది యువతీ యువ కులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మూడో సారి సీఎం కేసీఆర్ అయితే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధి స్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్ మొయీద్, వైస్ ఎంపీపీ వాల్ సింగ్, ఎంపీటీ సీలు, సర్పంచ్‌లు, నాయకులు, ప్రజా ప్రతినిధు లు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
పెంబి, నవంబర్ 24 : మండల కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పైడి పల్లి రవీందర్ రావు సమక్షంలో పుల్గంపాడ్రి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు లావుడ్య గోవింద్, సురేందర్, సుభాష్, రావుసింగ్, దశర థ్, గోపి, రవి, సుభాష్, కోక్య, సతీథ్తో పాటు పలువురు యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అహ్వానిం చారు. ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేసి భుక్యా జాన్షన్ నాయక్‌ను బారీ మేజార్టీతో గెలిపించాల న్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, సర్పంచ్ తానాజీ, నాయకులు భూక్యా గోవింద్, కనిరాం, సరోజ పాల్గొన్నారు.
ఖానాపూర్, నవంబర్ 24 : ఖానాపూర్ బీఆర్ ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఖానాపూర్లోని శివాజీ నగర్, అంబేద్కర్‌నగర్ కాలనీల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. నాయకులు గుగ్గిళ్ల రాజేందర్, ద్యావతి రాజేశ్వర్, దాసరి రాజన్న, సత్యనారాయణ, మల్లేశ్ పాల్గొన్నారు.
కడెం, నవంబర్ 23 : మండలంలోని పెద్ద బెల్లాల్, పాతమద్దిపడగ, ధర్మాజిపేట, మాసాయి పేట, లింగాపూర్, నర్సాపూర్కాలనీ, చిన్నబెల్లాల్, పెర్కపల్లి గ్రామాల్లో శుక్రవారం బీఆర్ఎస్ నాయ కులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్‌ను గెలిపిం చాలని కోరారు. ఈ నెల 26వ తేదీన ఖానాపూర్ లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు తరలి రావాలని కోరారు. సర్పంచ్ రమాదేవి, బీఆర్ఎస్ నాయకులు సురేందర్, రాజేందర్, సంగెపు రాజు, బత్తుల బాలరాజ్, పాకనాటి శేఖర్, కోల రాజేశ్వర్, ఎండపెల్లి వెంకటేశ్, శ్రావన్, తుప్ప ప్రశాంత్, బొర్లకుంట శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, నవంబర్ 24 : మండలం లోని దుర్గాపూర్ గ్రామంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ నాయకులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. జాన్సన్ నాయక్‌ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరా రు. సర్పంచ్ యశోద మోతీరాం, నాయకులు సౌకత్ఆలీ, కామెరి రాజు, శ్రీకాంత్, లక్ష్మిపతి, జబర్, మజీద్, అంజద్, సిరాజ్, మోసిన్, సజ్జత్, గ్రామస్తులు పాల్గొన్నారు. బిర్సాయిపేట్ గ్రామం లో జడ్పీటీసీ చారులత, సర్పంచ్ అంకవ్వతో కలిసి ప్రచారం నిర్వహించారు. దంతర్పెల్లి గ్రామంలో సీనియర్ నాయకుడు దాసండ్ల ప్రభా కర్ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు. చెరువుగూడ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. హస్నాపూర్ గ్రామంలో ఎంపీటీసీ శారద, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఈవీఎం లపై అవగాహన కల్పించారు.
సాలేవాడ(బీ) గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు మరప బాజీ రావు ప్రచారం నిర్వహించారు. హీరాపూర్ సర్పం చ్ హీరాపూర్, కన్నాపూర్ గ్రామంలో సర్పంచ్ జుగాదిరావు బీఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రచారం చేశారు. శ్యాంపూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు గడప గడపకూ ప్రచారం నిర్వహించా రు. నర్సాపూర్(బీ), లక్కారం గ్రామంలో బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు జోరుగా ప్రచారం చేశారు. ఉప సర్పంచ్ కోల సత్తన్న, భూమన్న, సిడాం సోనెరావు, మక్బుల్, బలవంత్, ముంజం అనుదీప్, గంగేశ్వర్, పోసక్క, బబిత, రంజనా బాయి, రాజమని, దూట మహేందర్, సాజిత్ సిద్ధిఖీ, గంగరాజు, సల్గర్ రవీందర్, కాటం రమేశ్, కేంద్రే రమేశ్, బలిరాం, ప్రదీప్, ఉత్తమ్, నందకుమార్, జాదవ్ వసంత్ పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 24 : మండలంలోని గౌరాపూర్, మర్కాగూడ, ధనోరా(బీ), దోబీ గూడ, సాలేగూడ, పిట్టబొంగురం, దస్నాపూర్, దస్నాపూర్‌గూడ గ్రామాల్లో బీఆర్ఎస్ మండలా ధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్ డోంగ్రే ఆధ్వర్యంలో నాయకులు ప్రచారం నిర్వహించా రు. శుగడపగడపకు వెళ్లి ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్‌ను గెలిపించాలని కోరారు. మర్కాగూడ గ్రామస్తులు బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్‌సింగ్, మండల కోఆప్షన్ సభ్యుడు మీర్జా జిలానీబేగ్, ఏమాయికుంట జీపీ సర్పంచ్ జాదవ్ లఖన్సింగ్, ఇంద్రవెల్లి జీపీ ఉపసర్పంచ్ గణేశ్టేహేరే, మాజీ వైస్ ఎంపీపీ విజయ్, ఎంపీటీసీలు కోవ రాజేశ్వర్, మడావి భీంరావ్, ధనోరా(బీ)జీపీ మాజీ సర్పంచ్ జాదవ్ జమునానాయక్, మండల బీఆర్ఎస్ నాయకులు గణేశ్ డోంగ్రే, శివాజీ సర్కాళే, శ్రీనివాస్, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, నవంబర్ 24 : మండలంలోని పలు గ్రామాల్లో వర్షం పడుతున్న వర్షంలోనూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ ను కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్, నవంబర్ 24ః తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కేసీఆర్‌తోనే సాద్యమని బీఆర్ఎస్ ఉట్నూర్ జడ్పీటీసీ చారులత అన్నారు. శుక్రవా రం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీ లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆటోడ్రైవర్లు బీఆర్ ఎస్ లో చేరారు. పలు వార్డుల్లో కార్యకర్తలు కరపత్రా లు పంపీణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకు లు ఆశన్న, మల్లన్న తదితరులున్నారు.