దస్తురాబాద్, నవంబర్ 25 : ఎన్నికల్లో తనను ఆశ్వీరదించండి.. నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు, ఎర్రగుంట, మల్లాపూర్ గొండు గూడెం గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, నాయకులు,కార్యకర్తలు ఆయనకు పూలమాలలు వేసి మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ తాను ఒక ఆశ ఆశ యంతో ఖానాపూర్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడానికి వచ్చానని పేర్కొన్నారు. మూడో సారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం అని, మల్లీ సీఎం కేసీఆరే మన ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. .
ఖానాపూర్, నవంబర్ 25 : ఖానాపూర్లోని పాత బస్టాండ్, కూరగాయల మార్కెట్లో బీఆర్ ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి భూక్యా జాన్సన్‌నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ద్యావతి రాజేశ్వర్, బక్కశెట్టి కిశోర్, గుగ్గిళ్ల రాజేందర్, దాసరి రాజన్న, సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఖానాపూర్ టౌన్, నవంబర్ 25 : ఖానాపూర్ లోని ఐదో వార్డులో కౌన్సిలర్ పరిలత ఆధ్వర్యం లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు బతుకమ్మ ఆడు తూ ప్రయాణికులకు అవగాహన కల్పించారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పరిమి సురేశ్, నాయ కులు నేత శ్యాం పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, నవంబర్ 25 : మండ లంలోని పలు గ్రామాలతో పాటు కొత్తపేట్‌లో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేప ట్టారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను అభ్య ర్థించారు. సర్పంచ్ కాశవేణి రాజన్న, శ్రీని వాస్, గ్రామస్తులు పాల్గొన్నారు.
పెంబి, నవంబర్ 25 : మండలంలోని హరి చంద్ తండాకు చెందిన బీజేపీ నాయకులు రాజేశ్వర్, నరేశ్, గోవింద్, మల్లేశ్, ప్రవీణ్‌తో పాటు పలువురు యువకులు ఖానాపూర్‌లో అభ్యర్థి జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. జడ్పీటీసీ జానుబాయి, నాయకులు భూక్యా గోవింద్ తపాల్గొన్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు సుతారి రమేశ్, కొడగంటి నర్సయ్య, మోహన్ రెడ్డి, బాలాజీ, దేవేందర్, రియాజ్, షారూఖ్‌ఖాన్, సూర్య పాల్గొన్నారు.
కడెం, నవంబర్ 25 : లక్ష్మీ సాగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బుర్ర రవిగౌడ్ శనివారం ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్‌నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఉపసర్పంచ్‌ల ఫోరం మం డల అధ్యక్షుడు ముడికె మల్లేశ్‌యాదవ్, భూక్యా రాజేశ్‌నాయక్, వార్డు సభ్యులు కంతి గంగసాగర్, గోదూరి ఆనంద్, నాయకులు రాజారెడ్డి, అశోక్, బాపన్న, రాజన్న పాల్గొన్నారు.
కడెంతోపాటు పెద్దూర్, పెద్దబెల్లాల్ ఎస్సీకాలనీ, చిన్న క్యాంపులో నాయకులు ప్రచారం చేశారు. జడ్పీ కో-ఆప్షన్ రఫీక్ హైమద్, సర్పంచ్ అనూష, ఆజాం, నాయ కులు లక్ష్మణ్, హైమద్, బోయిని మంగ, నుస్రత్, ఆర్ల రాజేశ్వరి కరుణ, ముబారక్, కే రవి, నల్లగొం డ, సపావత్ రవి, గౌసొద్ద్దీన్, కలీం, హాసీబ్, జాడి నర్సయ్య, జీల నాగరాజు, వరుణ్, సయ్యద్ షకీల్, వేణు నాయక్, భూక్యా శేఖర్, లావుడ్య గంగన్న, రమేశ్ నాయక్, ఎండీ అష్షు, సయ్యద్ కౌసర్, సన్నీ, రాంకిశోర్, నల్వాల రంజిత్, కోటయ్య, శంకర్, కొంరయ్య పాల్గొన్నారు.