ఆసిఫాబాద్ , డిసెంబర్ 23 : కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా సాగాయి. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు ఉదయం నుంచే పోటెత్తగా, ఆలయాలు కిటకిటలాడాయి. గోవింద నామస్మరణతో పరిసరాలు మారుమోగాయి. స్వామి వారికి అభిషేకాలు, పల్లకీసేవ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అధికారులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.