ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
సీసీ కెమెరాలు, సమావేశ భవనం ప్రారంభం
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 6 : న్యూహౌసింగ్‌బోర్డు కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పట్టణంలోని 12వ వార్డులోని న్యూహౌసింగ్ బోర్డు జోన్-1లో ఏర్పాటు చేసిన సమావేశ భవనంతో పాటు 25 సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యూహౌసింగ్ బోర్డు జోన్ -1లో కాలనీవాసులు తమ వంతు సహాయంగా రూ.9 లక్షలు జమ చేసి సీసీ కెమెరాలు, సమావేశ భవనం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకొని పట్టణంలోని ప్రతి కాలనీవాసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్‌లో దొంగతనాల బాధ ఉండదని తెలిపారు. అనంతరం పార్కులో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కౌన్సిలర్ జాదవ్ పవన్ నాయక్, తిరుమలేశ్, కాలనీ అభివృద్ధి కమిటీ నాయకులు శ్రీకాంత్, వినోద్‌రెడ్డి, విజయ్రావ్, సుభాష్, వెంకట్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి కృషి
ఆదిలాబాద్‌లోని ప్రసిద్ధ మారెమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగు రామ న్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్‌లో గల మారెమ్మ ఆలయంలో రూ.18 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్‌తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిలో భాగంగా గోపురంతో పాటు గదుల నిర్మాణాన్ని చేపడుతామన్నారు. రూ.18లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయిన పక్షంలో మరిన్ని నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. మారెమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు బాదన్ గంగన్న, లింగన్న, రఘు, కస్తాల ప్రేమల, తదితరులు పాల్గొన్నారు.