నిర్మల్‌ను అగ్రపథంలో నిలుపుదాం
నిర్మల్ జిల్లాను 2023లో మరింత అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు.
నిర్మల్ టౌన్, జనవరి 2 :నిర్మల్ జిల్లాను 2023లో మరింత అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేద్దామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు సోమవారంఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్ఛాలు, స్వీట్లు, పెన్నులు, పుస్తకాలు, పండ్లు, మొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గత ఏడాది అధికారులు, ఉద్యోగుల సమష్టి కృషితో జిల్లాను ప్రభుత్వ పథకాల్లో అన్నింటా ముందుంచామని చెప్పారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్ రాంబాబు, హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, డీఆర్వో విజయలక్ష్మి, డీఈవో రవీందర్‌రెడ్డి, జిల్లా అధికారి అంజిప్రసాద్, శంకర్, తిరుమల, రాజేశ్వర్‌గౌడ్, లోకేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, శంకరయ్య, అశోక్‌కుమార్, క్రాంతికుమార్, అశ్వక్, నర్సింహారెడ్డి ఉన్నారు. ఎంపీడీవోల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లను సన్మానించా రు.
టీఎన్జీవో, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో టీఎన్జీ వో అధ్యక్షుడు ప్రభాకర్, నాయకులు రవికుమార్, మోహన్‌రెడ్డి, జగదీశ్వర్, హుస్సేన్, అజయ్‌కుమార్, శ్రీనివాస్, సంతోష్, సుధాకర్, గంగాధర్, తహసీల్దార్లు తుకారాం, సుభాష్‌చందర్, నరేందర్, కిరణ్మయి ఉన్నారు.
పథకాల చేరువతో అధికారులకు గుర్తింపు
ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న అధికారులకు గుర్తింపు లభిస్తుందని నిర్మల్ జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలో ఎంపీడీవో సంఘం ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీడీవోలు అదనపు కలెక్టర్ రాంబాబు, హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. డీఆర్డీవో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు జడ్పీ చైర్మన్‌తో పాటు జడ్పీ సీఈవోను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా అధికారులు ఉద్యోగులు, కేక్ కట్ చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sathyavan Savithiri | లాయర్‌గా కీర్తి సురేష్.. ఆసక్తికరంగా ‘సత్యవాన్ సావిత్రి’ టీజర్!
Haindava Teaser | యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హైందవ’ టీజర్.. రికార్డు స్థాయిలో వ్యూస్‌తో మాస్ రెస్పాన్స్!
Nag Ashwin | ప్రభాస్ ‘కల్కి 2’తో భారీ ప్లాన్.. దుల్కర్ సల్మాన్, సాయి పల్లవి కోసం ప్రత్యేక వెబ్ సిరీస్‌లు?
ఏపీజే అబ్దుల్ కలాం సేవలు స్ఫూర్తిదాయకం : గూడెం మహిపాల్‌రెడ్డి
Pramila Jayapal | అది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం..ఇండియాలో ‘సర్’ పై యూఎస్ కాంగ్రెస్ మెంబర్ ప్రమిలా జయ్‌పాల్ తీవ్ర ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

