చింతలమానేపల్లి, జూన్ 5 : మండలంలోని బాబాసాగర్ గ్రామానికి చెందిన మూగ బాలిక గొర్లపల్లి శైల ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారింది. ఆమె ప్రస్తుతం బంధువుల వద్ద ఉంటున్నది. ఆమె పరిస్థితి తెలుసుకొని సామాజిక కార్యకర్త చప్పిడి ప్రకాశ్, సిద్ధం పెంటయ్య మంచిర్యాల పట్టణంలోని కల్వరి యువ శక్తి అనాథాశ్రమ నిర్వాహకుడు డాక్టర్ ముల్కల కుమార్కు సమాచారం అందించారు.
వెంటనే ఆయన స్పందించి గ్రామానికి వచ్చారు. చింతలమానేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నరేశ్, గ్రామస్తుల సమక్షంలో అనాథాశ్రమ నిర్వాహకుడు డాక్టర్ కుమార్కు బాలికను బుధవారం అప్పగించారు. ప్రత్యేక వాహనంలో ఆ బాలికను తీసుకెళ్లి మంచిర్యాల పట్టణంలోని కల్వరి యువ శక్తి అనాథాశ్రమంలో చేర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద శంకర్, పిప్రే సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.