మాదకద్రవ్యాలను నిర్మూలించాలి
మాదకద్రవ్యాలను నిర్మూలనకు యువత కృషి చేయాలని, గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ పేర్కొన్నారు.
- ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
ఎదులాపురం, జూన్ 26 : మాదకద్రవ్యాలను నిర్మూలనకు యువత కృషి చేయాలని, గంజాయి రహిత జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురసరించుకుని జిల్లా పోలీ సు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్‌లో ఘ నంగా 5కే రన్ నిర్వహించారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రారంభమైన ఈ రన్‌ను ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ జెండా ఊపి ప్రారంభించారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల నుంచి వచ్చి న సుమారు 2 వేల మంది యువత, క్రీడాకారులు, విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని యువతకు సూచించారు. వ్యసనానికి గురైన వారికి చికిత్స అందేలా కృషి చేయడం కూడా సమాజ బాధ్యతేనని పేరొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం జిల్లా పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ చెడు అలవాట్లకు దూరంగా ఉంచాలని సూచించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా 5 కిలోమీటర్ల పరుగును పూర్తి చేసి యువతకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం పురుషులు, మహిళల విభాగాల్లో తొలి పది మంది విజేతలకు సైకిళ్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒకరికీ ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. అనంతరం వాల్ ఆఫ్ ప్రామిస్ వద్ద అతిథులు సంతకాలు చేసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు. యాంటీ డ్రగ్ సోల్జర్ ఛాయాచిత్రం వద్ద ఫొటోలు దిగుతూ డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పీ.మౌనిక, బీ.సురేందర్ రావు, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, మారెట్ కమిటీ అధ్యక్షుడు బీ.శ్రీకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి : కలెక్టర్ అంకిత్
Besan Flour | షాపుల్లో శనగపిండి వద్దు.. ఇంట్లోనే ఇలా సులభంగా తయారు చేయొచ్చు..
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే, నేహా బోరాను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.. నిరసన ప్రదేశంలో కఠిన ఆంక్షలు
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరాయే లక్ష్యం : టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

