Donation | పాఠశాలకు శుద్ధ జల యంత్రం విరాళం
Donation | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 25 వేల విలువచేసే శుద్ధ జల యంత్రాన్ని గ్రామానికి చెందిన యువకుడు పురం శెట్టి రవికుమార్ అందించి ఔదార్యాన్ని చాటుకున్నాడు.
కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 25 వేల విలువచేసే శుద్ధ జల యంత్రాన్ని ( Pure water machine ) గ్రామానికి చెందిన యువకుడు పురం శెట్టి రవికుమార్ ( Ravi kumar ) అందించి ఔదార్యాన్ని చాటుకున్నాడు. శుక్రవారం పాఠశాలలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవంలో ( Independence Day) భాగంగా పాఠశాలలో యంత్రాన్ని బిగింపజేసి హెచ్ఎం దొంతుల సురేష్ తో కలిసి ప్రారంభించారు.

పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు శుద్ధ జల సేవనంతో విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. 100 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ శుద్ధ జల యంత్రాన్ని సక్రమంగా వినియోగించు కోవాలని దాత రవికుమార్ సూచించారు. ఈ సందర్భంగా దాతను పాఠశాల ఆధ్వర్యంలో హెచ్ఎం దొంతుల సురేష్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాతో సత్కరించి అభినందించారు.
పాఠశాల అభివృద్ధికి గ్రామంలోని దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని హెచ్ఎం కోరారు. అంతకుముందు పాఠశాలలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ బాలేరావ్ గంగాధర్, సాయి కుమార్, టెలికాంబోర్డు మాజీ సభ్యుడు పబ్బు ధర్మపురి, పంచాయతీ కార్యదర్శి పాండు సింగ్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
‘రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడాలి’
ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
‘శ్రీకృష్ణం వందే జగద్గురుం’ కోలాట బృందానికి జాతీయ పురస్కారం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

