కాగజ్నగర్, డిసెంబర్ 2 : రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల సంక్షేమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ నియోజకవర్గం కన్వీనర్ లెండుగురే శ్యాంరావు, బీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జి ముస్తాఫా ఆరోపించా రు. సోమవారం కాగజ్నగర్ పట్టణంలోని జ్యోతి బాపూలే, గన్నారంలోని జ్యోతిబా పూలే సందర్శించారు. ఆపై సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని గురుకుల విద్యాలయానికి వెళ్లగా, పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేటు ఎ దుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడు తూ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నా రు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సర్కారు వైఫల్యం వల్లే ఇటీవల వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు మోయి న్ అలీ, నక్క మనోహర్, తదితరులు పాల్గొన్నారు.