నార్నూర్, అక్టోబర్ 15 : గుండెపోటు వచ్చినప్పుడు అత్యవసర సమయంలో ప్రాణ రక్షణ పద్ధతులు సిపిఆర్ ను ఉపయోగించాలని అడిషనల్ డీఎంహెచ్ఓ కుడ్మెత మనోహర్ వైద్య సిబ్బందికి సూచించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో సిపిఆర్ విధానం చాలా ఉపయోగప డుతుందన్నారు. ఈ విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విధానాన్ని అనుసరించడంతో ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ఇక్కడ వైద్యాధికారి రాంబాబు, వైద్య సిబ్బంది నాందేవ్, సుశీల, చరణ్ దాస్, సత్యవ్వ, గణేష్ కుమారి, విల్లాస్, రవీందర్ తదితరులున్నారు.