తాండూర్, అక్టోబర్ 15: మంచిర్యాల జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ 17 బాలబాలికల కబడ్డీ ఎంపిక పోటీలు బుధవారం తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల గ్రౌండ్లో నిర్వహించారు. ఈ ఎంపిక పోటీలలో మంచిర్యాల జిల్లాలోని వివిధ మండలాల ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాల పాఠశాలలకు చెందిన 500 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి ఎస్జీఎఫ్ జోనల్ (నాలుగు జిల్లాల) టోర్నమెంట్లో పాల్గొంటారని వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు సాంబమూర్తి, క్రీడా సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.
ఈ ఎంపిక పోటీలు అచ్చలాపూర్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాద్యాయురాలు పి ఉమాదేవి అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథులుగా తాండూర్ ఎంపీపీడీవో పీ శ్రీనివాస్, జిల్లా డీజీఈబీ సెక్రటరీ పీ మహేశ్వర్ రెడ్డి, ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎండీ యాకూబ్, నాయకులు సూరం రవీందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్ మహేందర్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గట్టు మురళీధర్ రావు, తాండూర్, రేచిని హెచ్ఎఎంలు డీ శ్రీనివాస్, ఎం ప్రధీప్, క్రీడల అబ్జర్వర్ ఫిరంగి గోపాల్, ఫిజికల్ డైరెక్టర్ సుదర్శన్, జిల్లాలోని వివిధ పాఠశాలల పీఈటీలు, పీడీలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.