తిర్యాణి,ఆగస్టు 25 : చింతలమాదర జలపాత ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని జిల్లా అటవీశాఖ అధికారి నీరజ్‌కుమార్ అన్నారు. ఆదివారం జలపాతంతో పాటు అటవీప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జలపాతం అందాలను వీక్షించేందుకు వచ్చే సందర్శకుల కోసం సౌకర్యాలు కల్పిస్తామన్నారు. జలపాతం వద్ద డ్రెస్సింగ్ రూం, మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని కమిటీని ఆదేశించారు.
జలపాతం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ, జలపాత ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టాలన్నారు. పాత పద్ధతిలాగే టికెట్లు అమ్మాలని కమిటీకి సూచించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సందర్శకుల ద్వారా అడవులకు ఎలాంటి ముప్పు జరుగకుండా చూడాలని అటవీ సిబ్బందికి సూచించారు. జలపాతం చుట్టూ రక్షణ చర్యలు ఉండేలా చూడాలని కమిటీకి సూచించారు. గిన్నేధరి రేంజర్ వెంకన్న, డీఆర్వో ప్రవీణ్‌కుమార్, ఈటీసీ చైర్మన్ తుంరం గోపాల్, ఎఫ్ఎస్వో రాంసింగ్, ఎఫ్‌బీవో రాకేశ్ కమిటీ సభ్యులు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.