గుడిహత్నూర్, జనవరి 12 : గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేస్తున్నదని మండల వైద్యాధికారి సాయిప్రియ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీలో గర్భిణులు, బాలింతలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ అన్నపూర్ణ, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
మండల కేంద్రంలోని పీహెచ్సీలో గురువారం ఏఎన్సీ శిబిరం నిర్వహించారు. డాక్టర్ విజయలక్ష్మి, సిబ్బంది 30 మంది గర్భిణులకు రక్త ,స్కానింగ్ పరీక్షలు చేశారు. మందులు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు అందజేశారు. ఈ శిబిరంలో హెచ్ఈవో జ్ఞానేశ్వర్, సిబ్బంది లూసి, గంగాధర్, దివ్య, భాగ్యవతి, గోదావరి, విష్ణుకుమార్, శంకర్, శివాజీ, అశోక్ పాల్గొన్నారు.