కడెం : మండలంలోని దిల్దార్ నగర్ (Dildar Nagar ) గ్రామ సమీపంలోని అటవీ ప్రాంత గోదావరి తీరాన శ్రీలక్ష్మీ నరసింహస్వామి (Narasimha Swamy Kalyanam ) ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
మొదటిరోజు భీష్మ ఏకదశిని పురష్కరించుకొని దిల్దార్ నగర్, ఎలగడన గ్రామాల్లో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉత్సవ విగ్రహాలతో పల్లకిసేవను నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణ ( Swamy Kalyanam ) మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. కార్యక్రమాల్లో భాగంగా పుణ్యహావచనం, అంకురారోహణ, రక్ష బంధనము, ధ్వజరోహణం, అగ్నిప్రతిష్ఠ, గురుజలగ్నము శాస్త్రోక్తకంగా నిర్వహించారు.
అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి తిరు కళ్యాణమహోత్సవాన్ని ముత్యాల తలంబ్రాలతో నిర్వహించారు. శ్రీ అక్కకొండ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి ఏడాది వైభవంగా జరుగుతుందడంతో ఈ ఉత్సవాలను తిలకించేందుకు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఈనెల 12న రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు వంశీకృష్ణచార్యులు, అజయ్ ఆచార్య, సంజయచార్య తెలిపారు. ఉత్సవాలకు వచ్చిన భక్తుల కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.