ఆదిలాబాద్ : ఆదిలాబాద్ (Adilabad District) జిల్లా కేంద్రానికి సమీపంలోని కొమరం భీం(Komuram Bheem) కాలనీవాసులకు గృహ జ్యోతి పథకంలో కరెంటు మీటర్లు (Electricity meters ) మంజూరు చేయాలని కాలనీవాసులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా (Dharna) నిర్వహించారు. కాలనీలో పేదలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు తెలిపారు.
ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా తమకు కరెంట్ మీటర్లు మంజూరు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా కాలనీవాసులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ధర్నా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.