కెరమెరి, జనవరి 16 : ఉత్తూర్పేటలో కొలువైన ధర్మరాజు, పోతురాజు జాతర గురువారం ప్రారంభం కాగా భక్తులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఏఎస్పీ చిత్తరంజన్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ పీవీటీజీ ఏపీవో మెస్రం మనోహర్ పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి కబడ్డీ పోటీలు ప్రారంభించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా వాంకిడి సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐ గుంపుల విజయ్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ సీనియర్ అసిస్టెంట్ శ్యామల, మాజీ ఎంపీపీ పెందోర్ మోతీరాం, మాజీ జడ్పీటీసీ సెడ్మాకి దుర్పతాబాయి, కటోడ లచ్చు, దేవ్రావ్, ఆలయ కమిటీ చైర్మన్ సిడాంరాజు, కార్యదర్శి సిడాం ధర్ము, నాయకులు పెందోర్ రాజేశ్వర్, మడవి రఘునాథ్ పాల్గొన్నారు.