నార్నూర్ : ప్రతి ఒక్కరి సహకారంతోనే మండలం అభివృద్ధి సాధ్యమని ఎంపీడీవో పుల్లారావ్ ( MPDO Pullarao ) అన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఎంపీడీవో పుల్లారావ్, ఎంపీవో మహేష్ నాయకులు శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ అందరి సహకారం ఉంటేనే మండలాన్ని అభివృద్ధి సులభతరంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలి అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోయం మారుతి, మాజీ జడ్పీటీసీ హేమలత బ్రిజ్జిలాల్, డైరెక్టర్లు దుర్గే కాంతారావ్, జాదవ్ కైలాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లోకండే దేవ్ రావు, చిన్నయ్య, అర్క గోవింద్, సత్తార్ తదితరులున్నారు.