ఇంద్రవెల్లి, మే 13 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ పేర్కొన్నారు. ఈశ్వర్‌నగర్ పెట్రోల్ పంపు నుంచి గిన్నేరా వరకు శనివారం తన అనుచరులతోపాటు అభిమానులు, బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఆయన మోటర్ సైకిల్‌పై నిల్చొని ప్రజలకు అభివాదం చేశారు. గిన్నేరా గ్రామానికి చేరుకొని పాఠశాల భవనం మర మ్మతుకు రూ. 2 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామస్తులు ఆయనను సన్మానిం చారు. దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, నాయ కులు సత్యానంద్, ఎండీ జునైద్, పరత్వాగ్ దత్తా, రజినీ, బాపురావ్, బాలాజీ, మీర్జా సుఫియాన్, తదితరులు పాల్గొన్నారు.