శ్రీరాంపూర్, జూన్ 14 : సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార డైరెక్టర్లు, అధికారులకు పిలుపునిచ్చా రు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సింగరేణి డైరెక్టర్లు, అధికారులతో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్, సింగరేణి సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి, కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు, డీసీపీ భాసర్‌తో కలిసి ఆయన హాజరయ్యారు.
ఓపెన్ కాస్ట్‌ను సందర్శించి, రక్షణ పద్ధతులు, బొగ్గు నాణ్యత, ఉత్పత్తి ఉత్పాదకత, నిల్వ, రవాణా వంటి అంశాలతోపాటు, గ్రేడ్ 10, 11 బొగ్గు ఉత్పత్తి, నిల్వ ప్రదేశాలు, రికార్డులు పరిశీలించినట్లు వెల్లడించారు. కార్మికుల ఆరోగ్య సమస్యల పరిషారం కోసం అధునాతన వైద్య పరికరాలు, నూతన వైద్య విధానాల ద్వారా సేవలు అందించనున్నట్లు తెలిపారు. డైరెక్టర్లు గౌతమ్ పోట్రూ, ఎల్వీ సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమల్‌రావు, బీ వెంకన్న, జీఎం శ్రీనివాస్, క్వాలిటీ మేనేజర్ వీరభద్రం, జీఎం సేఫ్టీ రఘుకుమార్, నాయకలు, అధికారులు పాల్గొన్నారు.