మంచిర్యాల అర్బన్, ఫిబ్రవరి 12 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని డీఈవో యాదయ్య అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురష్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్లో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులను బాలశాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు.
ఇందులో భాగంగా విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో ‘సుస్థిర భవిష్యత్తు కోసం వైజ్ఞానిక శాస్త్రం’ అంశం మీద ఉపన్యాసం, కవితలు, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో సత్తాచాటిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానా ల్లో నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.
జిల్లా స్థాయిలో నాలుగు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 12 మంది విద్యార్థులు రాష్ట్ర స్థా యి పోటీలకు ఎంపికైనట్లు డీఈవో యాద య్య ప్రకటించారు. చిత్రలేఖనంలో… సీహెచ్ తనియా (జడ్పీఎస్ఎస్ దేవాపూర్) మొదటి స్థానంలో నిలువగా, ఎల్ సాయి దీక్షిత్ (జడ్పీఎస్ఎస్ శాంతిఖని) ద్వితీయ, కే అక్షిత (కేజీబీవీ మంచిర్యాల) తృతీయ స్థానంలో నిలిచారన్నారు. పాటల పోటీల్లో… హర్షిత (జడ్పీఎస్ఎస్ అచ్చులాపూర్) ప్రథమ, బీ స్నేహ (జడ్పీఎస్ఎస్ భీమారం), అలేఖ్య (జడ్పీఎస్ఎస్ వెల్గానూర్), కవితల పోటీల్లో… డీ శ్రావ్య (కేజీబీవీ కోటపల్లి) ప్రథమ, ఎం అఖిల (జీహెచ్ఎస్ గర్మిళ్ల) ద్వితీయ,
టీ శ్రావణి (జడ్పీఎస్ఎస్ జెండావెంకటాపూర్), ఉపన్యాసం పోటీల్లో… బీ పుష్పలత (టీఎస్డబ్ల్యూఆర్జేసీ బాలికలు, బెల్లంపల్లి) ప్రథమ, అంజి ( జడ్పీహెచ్ఎస్ గుడిరేవు) ద్వితీయ, హశ్రిత (జడ్పీఎస్ఎస్ అచ్చులాపూర్) తృతీయ స్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు. వీరంతా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, హెచ్ఎంలు రాజగోపాల్, శ్రీనివాస్, న్యాయనిర్ణేతలు బీ నారాయణ రావు, ఆర్కే ప్రసాద్, శ్రీనివాస్, శ్రీమూర్తి, జ్యోతి, మంజుల, మూర్తి, పోచయ్య, సైన్స్ సెంటర్ నిర్వాహకులు సాయి, సంపత్, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.