నస్పూర్, జనవరి 4 : మార్చిలో జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఈవో యాదయ్య పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఎంఈవోలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ వంద శాతం ఫలితాలు, అత్యధిక మార్కులు సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు.
పదో తరగతి పరీక్ష విధానంలో వచ్చిన మార్పులు, వాటికి అనుగుణంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్షల విభాగం అదనపు కమిషనర్ దామోదర్‌రావు, సమగ్ర శిక్షా కో ఆర్డినేటర్లు చౌదరి, యశోదర, శ్రీనివాస్, రాజ్‌కుమార్, సత్యనారాయణమూర్తి, కుమారస్వామి పాల్గొన్నారు.