ఆదిలాబాద్ టౌన్ అక్టోబర్ 25 : దండారీ ఉత్సవాలు జిల్లాలో ఆదివాసులు భక్తి శ్రద్ధ్దలతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఆదిలాబాద్ రూరల్ మండలం కచ్కంటి, యాపల్‌గూడ, రాములుగూడ గ్రామాల్లో జరిగిన దండారీ ఉత్సవాల్లో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆదివాసీలు తమ సంప్రదాయ వాయిద్యాలు, గుస్సాడీలతో ఘనంగా స్వాగతం పలికారు. మొదట ఎమ్మెల్యే ఆదివాసీల ఆరాధ్య దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఎమ్మెల్యే గుస్సాడీలతో కలిసి కోలాటం ఆడుతూ ఉత్సాహం నింపారు. ప్రభు త్వం అందించిన రూ.10 వేల ప్రోత్సాహక నగదు పురస్కారాన్ని పంపిణీ చేశారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనో హర్, ఎంపీపీ గండ్రత్ రమేశ్, సెవ్వ జగదీశ్ యాదవ్, మెట్టు ప్రహ్లద్, జిట్టా రమేశ్, కనక రమణ, ఆరె నరేశ్, బిక్కి గంగాధర్ పాల్గొన్నారు.
బోథ్‌లో..
బోథ్, అక్టోబర్ 25 : మండలంలోని ఆదివాసీ గూడేల్లో దండారీ ఉత్సవాలు వైభవంగా నిర్వహి స్తున్నారు. మంగళవారం పార్డీ (కే), పార్డీ (బీ), అందూర్, మందబొగుడ, నిగిని, కంటె గాం, వజ్జర్, సాంగ్వి, నక్కలవాడ, చింతగూడ, కొత్తప ల్లె, లక్ష్మీపూర్, పట్నాపూర్, జీడీపల్లె తదితర అన్నీ గూడేల్లో ఉత్సవాలు నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య గుస్సాడీలు డింసా నృత్యాలు చేశారు. యువకులు కోలాటాలు ప్రదర్శించారు. అంతకు ముందు గ్రామ పటేళ్ల ఇళ్ల ఎదుట గుస్సాడీ వేషధారణకు వినియోగించే వస్తువులకు పూజలు చేశారు.
దస్తురాబాద్‌లో..
దస్తురాబాద్, అక్టోబర్ 25 : ఆదివాసీ గూడే ల్లో దీపావళి పర్వదినం సందర్భంగా దండారీ వేడుకలు ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. దీంతో ఆదివాసీ గూడెల్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంది. డప్పు చప్పుళ్లతో గూడేలు మారుమోగాయి. గుస్సాడీల నృత్యాలు ఆకట్టుకు న్నాయి. గోండు గూడెంలో దండారీ ఉత్సవాలను ఆదివాసీలు వైభవంగా జరుపుకున్నారు. దీపావళి (దండారీ) పండుగను భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకుంటారు. మున్యాల గోండు గూడెం, ఆకొండపేట గొండు గూడెం గుస్సాడీ బృందాలు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవులోని గోదావరి ఒడ్డున వెలిసిన కాకో బాయిని దర్శించుకున్నారు.
నిర్మల్‌లో..
నిర్మల్ అర్బన్ అక్టోబర్ 25 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వనాథ్‌పేట్ కాలనీలో ఏత్మాసూర్ పండుగను వారం రోజుల పాటు నిర్వహించినట్లు నిర్వాహకుడు నైతం భీమ్‌రాం తెలిపారు. తలపై నెమలి ఈకల టోపీ ధరించి ఉత్సవాలను నిర్వ హించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ముగించినట్లు తెలిపారు. రమేశ్, లక్ష్మణ్, భీం రావు, ఆనంద్ రావు, వినోద్, నైతం కుర్మ బాయి, గంగ, వర్ని బాయి పాల్గొన్నారు.