సీసీసీ నస్పూర్, మే 3 : నస్పూర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో గల అంబేద్కర్ భవన్లో దళితరత్న అవార్డు గ్రహీత ఇరికిళ్ల పురుషోత్తంను ఆ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం స్థానిక కార్పొరేటర్ ఎండీ ఖలీద్, అంబేద్కర్ సంఘం నాయకులు కొప్పర్తి రాజం, కొయ్యల కొమురయ్య, తదితరులు ఇరికిళ్ల పురుషోత్తంను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. పురుషోత్తంకు దళితరత్న అవార్డు రావాడం సంతోషదాయకమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన, దళితుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ ఇలాంటి అవార్డులు మరిన్ని పొందాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు మాడుగుల మహేశ్, ఇరికిళ్ల మనోజ్, మాడుగుల కిరణ్, ఇరికిళ్ల రాములు, శంకర్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, మాడుగుల రాజం, ఎక్బాల్, మాడుగుల సమ్మయ్య, ఇరికిళ్ల బీమక్క, శంకరవ్వ, పద్మ, ప్రమీల, ఇరికిళ్ల మహే పాల్గొన్నారు.