ఎదులాపురం, ఫిబ్రవరి 24: ఏ రాష్ట్రంలో దళితులకు ఇవ్వని విధంగా మూడెకరాల భూమి, దళిత బంధు పథకాలు యావత్ దేశానికే ఆదర్శం గా నిలుస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. దళిత బంధుపై స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో గురువారం ఎస్సీకార్పొరేషన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడారు. అంబేద్కర్ ఆశయ సాధన దిశగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందన్నారు. దళితులందరూ ఆర్థికాభివృద్ధి సాధించేలా పథకాలు అమలు చేస్తున్నారని చెప్పా రు. దళితుల ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున జమ చేస్తున్నట్లు వివరించారు. ఎంపికైన వారికి వచ్చే నెలల్లో యూనిట్లు గ్రౌండింగ్ చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాకు రూ.7 కోట్లు వచ్చాయని తెలిపారు. లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లను ఎంచుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. మొదటి విడుతలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 100 మందిని ఎంపిక చేశామని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. సమావేశంలో డీఆర్డీవో కిషన్, ఎస్సీకార్పొరేషన్ ఈడీ శంకర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత, జిల్లా పరిషత్ అడిషనల్ సీఈవో రాథోడ్ రాజేశ్వర్, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, ఎంపీపీ సెవ్వలక్ష్మి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టుప్రహ్లాద్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, ఫిబ్రవరి 24: పార్టీలకు అతీతంగా పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని 25వ వార్డు చించర్వాడలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు గురువారం భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పుట్టిన బిడ్డ నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, వైస్‌చైర్మన్ జహీర్ రంజానీ, ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, బాదం గంగన్న, కస్తాల ప్రేమల పాల్గొన్నారు.
జైనథ్, ఫిబ్రవరి 24: వైద్యవ్యవస్థలో ఆశ కార్యకర్తల పాత్ర కీలకమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్, బేలలో ఆశ కార్యకర్తలకు గురువారం స్మార్ట్ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా విపత్తు సమయంలో ఆశ కార్యకర్తలు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారని కొనియాడారు. స్మార్ట్ఫోన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో నరేందర్‌రాథోడ్, డీసీసీబీ చైర్మన్ అడ్డిభోజారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, ఎంపీపీలు మార్శెట్టి గోవర్ధన్, ఠాక్రే వనిత, వైస్ ఎంపీపీ విజయ్‌కుమార్, నాయకులు ఎస్ లింగారెడ్డి, తుమ్మల వెంకట్‌రెడ్డి, పెందూర్ దేవన్న, డాక్టర్ అనిత, గంభీర్ ఠాక్రే, మంగేశ్, సతీశ్ పవార్, మధుకర్ ఉన్నారు.
75మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ బేలలో 75మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే జోగురామన్న పంపిణీ చేశారు. అనంతరం ఇద్దరికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని చెప్పారు.