ఇంద్రవెల్లి, ఏప్రిల్ 19 : గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు అమలు చేసిందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని దస్నాపూర్‌లో 16 మందికి దళితబంధు కింద యూనిట్లు మంజూరవగా, మంగళవారం ప్రొసిడింగ్తో పాటు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర అందించి, కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, ఎంపీపీ పోటె శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతీపటేల్ డోంగ్రె, ఏఎంసీ చైర్మన్ జాదవ్ శ్రీనివాస్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, సర్పంచులు జావదే పార్వతీబాయి, కోరెంగ గాంధారి, రాథోడ్ శారద, ఎంపీటీసీ జాదవ్ స్వర్ణలత, ఎంపీడీవో పుష్పలత, దస్నాపూర్ గ్రామ పటేల్ కోటులే పుండలిక్, టీఆర్ఎస్ నాయకులు దేవ్‌పూజే మారుతి, కనక హనుమంత్‌రావ్, పోటె సాయినాథ్, షేక్ సుఫియాన్, మహేశ్కదం, కేశవ్, బాబుముండే, నగేశ్, కేంద్రెశ్యామ్, నవాబ్బేగ్ తదితరులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 19 : ఉట్నూర్ మండలం ఘన్‌పూర్‌లో 10 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే యూనిట్లను అందించారు. అంతకుముందు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు. అనంతరం రేఖానాయక్ మాట్లాడుతూ.. దళితబంధు దేశానికే ఆదర్శమన్నారు. గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధికి బాటలు వేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పంద్ర లత, ఈడీ శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీరాంనాయక్, ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు రషీద్, పశువైద్యాధికారి రాథోడ్ రమేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, ఏపీవో రజినీకాంత్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, మాజీ మండలాధ్యక్షుడు దాసండ్ల ప్రభాకర్, సింగారే భరత్, కామెరి పోశన్న, నాయకులు సెడ్మకి సీతారాం, జవ్వాద్ అన్సారీ, కేంద్రె రమేశ్, ప్రజ్ఞశీల్, వెంకటేశ్, కుటికెల ఆశన్న, మెరిగెడి మనోహర్, లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.