మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 19 : సమక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని రామంగుండం సీపీ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల పట్టణంలో నిర్వహించే సమక్క-సారలమ్మ జాతర స్థలాన్ని పరిశీలించారు.
అనంతరం మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్ధం కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, దొంగతనాలు జరగకుండా స్పెషల్ టీంలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భూకబ్జాలు చేసినా.. రేషన్ బియ్యం దందా, గుడుంబా, గంజాయి రవాణావంటివి చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.