నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 26 : నిర్మల్ పట్టణంలోని ఎల్లపెల్లి శివారులో నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీకృత భవన నిర్మాణ పనులను మార్చి మొదటి వారంలో పు పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణ పనులు, సుందరీకరణ, గార్డెన్, హెలీప్యాడ్ తదితర పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మార్చి రెండోవారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు పనులను నాణ్యతగా, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ అశోక్, డీఎస్పీ జీవన్‌రెడ్డి, నాలుగో వార్డు కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సీఏ కార్యాలయం ప్రారంభం
నిర్మల్ అర్బన్, ఫిబ్రవరి 26 : నిర్మల్ పట్టణంలోని శివాజీ చౌక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సీఏ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్వాహకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం పక్కనే ఉన్న రెడ్ బకెట్ బిర్యానీ పాయింట్‌ను మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.