ఎదులాపురం, అక్టోబర్ 6 : మరోసారి అవకాశమిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోని అశోక్ బుద్ధ విహార్‌లో రూ.కోటితో చేపడుతున్న అశోక్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ముందుగా ఎమ్మెల్యే జోగు రామన్నకు పుష్పగుచ్ఛం అందజేసి బ్యాండ్‌మేళాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌తోనే సుపరిపాలన సాధ్యమన్నారు.
ప్రతి వార్డులో అశోక్ బుద్ధ విహార్‌లు ఏర్పాటు చేస్తున్నామని, అవసరమైతే అదనంగా నిధులు మంజూరు చేస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత అర్హులకు ఇంటి స్థలాలు ఇస్తామన్నారు. అలాగే గృహలక్ష్మి పథకం అందరికీ వర్తింపజేస్తామన్నారు. అనంతరం మరాఠీలో అభివృద్ధి, సంక్షేమంపై మాట్లాడారు. కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భీంరావ్ వాగ్మారే, దాదాసాహేబ్ జాబడే, బీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద్, రాంకుమార్, సాజీదుద్దీన్, పట్టణ మాహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు స్వరూపరాణి, మమత, అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఉద్దవ్ సూర్యవంశీ, కోశాధికారి అంబాజీ పవార్, జిల్లా సంయుక్తకార్యదర్శిగా ఆకాశ్‌దీప్ కాంబ్లే, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 6: ప్రజా శ్రేయస్సే పరమావధిగా ప్రభుత్వం పాటు పడుతోందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. మావలలో మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రజాహితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని, అనుక్షణం ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడుతోందని అన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలను ఆడబిడ్డలు సంతోషంగా జరుపుకోవాలనే సద్దుదేశంతో ఎనిమిది సంవత్సరాలుగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రమీల, నాయకులు పాల్గొన్నారు.
జైనథ్, అక్టోబర్ 6 : గ్రామీణ యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. జైనథ్‌లో రూ.3 కోట్ల 58 లక్షలతో చేపడుతున్న మినీ స్టేడియం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం 42 గ్రామాల క్రీడాకారులకు క్రీడా పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి వెంకటేశ్వర్లు, పీఆర్‌ఈఈ మహావీర్, ఎంపీపీ గోవర్ధన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ, నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.