హాజీపూర్, జనవరి 3 : పోలీసులు అంకిత భావంతో పని చేయాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ దీపక్ కుమార్ అ న్నారు. శుక్రవారం మండలంలోని గుడిపేట పోలీస్ బెటాలియన్‌లో శిక్షణ పొందిన 548 మంది కానిస్టేబు ళ్లు అవుట్ పాసింగ్ పరేడ్‌ను నిర్వహించారు. కలెక్టర్ దీపక్ కుమార్, బెటాలియన్ కమాండెంట్ వెంకట్రాములు, రామగుండం పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ డీసీ పీ రాజు ప్ర త్యేక వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు.
పరేడ్ కమాండర్‌తో పాటు మొత్తం ఎనిమిది ప్లాటూన్ కమాండర్లు దీక్షాంత్పరేడ్ను నిర్వహించారు. ముఖ్య అతిథి అనుమతితో కమాండెంట్ వెంకట్రాములుతో కలిసి ప్రమాణం చేసిన శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు.. ఆపై పరేడ్ చేసి అంద రి హృదయాలను గెలుచుకున్నారు. కరాటే విన్యాసాలు, సైలెంట్ డ్రిల్, మార్కో కమాండెంట్ల ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్లకు, శిక్షకులకు కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. అస్టిటెంట్ కమాండెంట్ నాగేశ్వరరావు, ఆర్ఐ శ్రీనివాస్, ఆర్ఎస్ఐలు రాజన్న, రవి, శేఖర్ ఆధ్వర్వం లో 45మందికి అద్భుతమైన శిక్షణ అందించారు. రా మగుండం అడిషనల్ డీసీపీ రాజు, మంచిర్యాల డీసీపీ భాస్కర్, అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వరరావు, కాళిదాసు, సింగరేణి జీఎం సూర్యనారాయణ, డీఎఫ్‌వో భగవాన్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, హాజీపూర్ ఎస్ఐ గోపతి సురేశ్ యూనిట్ మెడికల్ వైద్యాధికారి సంతోశ్ సింగ్, ఏవో ఉమేశ్ కుమార్ పాల్గొన్నారు.
మాది వ్యవసాయ కుటుంబం. పోలీసు ఉద్యోగమంటే చాలా ఇష్టం. అందుకే కష్టపడి కానిస్టే బుల్గా ఎంపికైన. తొమ్మిది నెలల పాటు ఇక్కడ శిక్షణ తీసుకున్న. అనేక విషయాలు నేర్చుకున్న. విధుల్లో చేరబోతున్నందుకు ఆనందంగా ఉంది. క్రమశిక్షణతో ప్రజలకు సేవలందిస్తా. -గోపని సాయిబాబు (మేడ్చేల్)
మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న ఆటో డ్రైవర్. అమ్మ లేదు. సర్కారు కొలువు సాధించాలని మా అమ్మ ఎప్పుడూ చేప్పేది. అందుకే కష్టపడి మేమిద్దరం (అన్నదమ్ములు) ఉద్యోగాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు మా అమ్మ ఉంటే చాలా సంతోషించేది. అమ్మకల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉన్నాం.
– చట్ట అంటోని రాజ్, చట్ట వినోద్‌కుమార్ (మేడ్చల్)