ఎదులాపురం, ఆగస్టు 31 : ఆదిలాబాద్ మున్సిపల్ స ర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. శనివారం కార్యాలయ సమావేశ మందిరంలో చైర్మన్ ప్రేమేందర్ అధ్యక్షతన 13 అంశాలపై కౌన్సి ల్ సమావేశం ప్రారంభమైంది. తొలుత కాంగ్రెస్ కౌన్సిలర్లు తాంసి బస్టాండ్ వద్ద సులభ్ కాంప్లెక్ కూల్చి వేసి భవనం నిర్మిస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని ప్ల కా ర్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అదే సమయంలో వినాయక చవితి సమిపిస్తున్నా గుంతలను పూడ్చడానికి గ్రావెల్ టెండర్ ఇచ్చిన స్పం దించని కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని బీజేపీ కౌ న్సిలర్లు చైర్మన్‌కు వినతి పత్రం అందించారు. కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లను శాంతింపజేసి అజెండా అనంతరం జీరో అవర్స్‌లో మాట్లాడతామని చైర్మన్ చెప్పారు.
అయినా వినకుండా పట్టుబట్టారు. రూ.కోట్ల విలువ గల ము న్సిపల్ భూములు కబ్జాకు గురవుతున్నాయని, సదరు కబ్జాదారుడు దర్జగా నిర్మాణాలు చేపడుతున్నా పట్టించుకోరా అని కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. అనంతరం 13 అంశాలతో ప్రవేశపెట్టిన అజెండాను సభ్యులు ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ప్రేమేందర్ మాట్లాడు తూ.. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో మున్సిపల్ తరఫున ఏర్పాట్లకు రూ.16 లక్షలను కేటాయించామన్నారు. బతుకమ్మ ఘాట్ల మరమ్మతులు కూడా చేపడతామన్నారు. అదేవిధంగా వీధి దీపాల కోసం రూ.5 లక్షలను అజెండాలో పెట్టామన్నారు. భుక్తాపూర్తోపాటు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో కబ్జాలు జరిగాయని, వారికి నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మ ద్ ఖాన్, డీఈలు తిరుపతి, కార్తీక్, శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ పాల్గొన్నారు.