తాంసి : మండలంలోని హస్నాపూర్ గ్రామ రైతులు పండించిన కంది పంటను(Toar dal crop) శుక్రవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarsi Sha) పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు వేదికలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి పంట దిగుబడుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరానికి కందులు ఆరు నుంచి ఏడు క్వింటాళ్లు పండుతాయని రైతులు కలెక్టర్కు వివరించారు.
పండిన పంటను ప్రభుత్వమే కొనేలా చూడాలని అన్నారు. రైతుల సమస్యలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రవీందర్, వ్యవసాయ విస్తరణ అధికారి అమీరోద్దిన్, నాయకులు రాంచందర్ రెడ్డి, నర్సింగ్ రైతులు ఉన్నారు.