భైంసా, జూలై 4 : రైతులకు నష్టాలు కలిగిస్తున్న నకిలీ సోయా విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే నష్టపోయిన రైతులకు విత్తన కంపెనీల నుంచి తగిన నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ శనివారం పలువురు రైతులు సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల కారణంగా అనేక మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. వినతిపత్రం అందజేసిన వారిలో వెంకటేశ్, దత్తహరి, సాయినాథ్, బీ.సాయినాథ్, వీ.సాయిలు, ఏ.సంతోష్, టీ.వెంకటేశ్, రమేశ్, యోగేశ్, కడం వినోద్, సాహెబ్ రావు, సాయినాథ్, గణేశ్ ఉన్నారు.

బజార్హత్నూర్, జూలై 4 : ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో సోయా విత్తనాలు మొలకెత్తడం లేదని, వెంటనే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు తహసీల్దార్ శ్యాంసుందర్, ఏఈవో సంతోష్‌లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తోకల విఠల్, డుబ్బుల చంద్ర శేఖర్, ప్రభాకర్, సంజీవ్, తాండ్ర శ్రీనివాస్, క్యాతం శివ కుమార్, గాండ్ల లక్ష్మన్, గుర్ల భోజన్న, పాట కిష్టయ్య, పాడిపెల్లి హరికృష్ణ, సుకుమార్ పాల్గొన్నారు.
భైంసా టౌన్, జూలై 4 : నాసిరకం నకిలీ సోయా విత్తనాల వల్ల పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి ఉన్నతస్థాయి అధికారులకు నివేదిస్తామని, ప్రభుత్వపరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా వ్యవసాయాధికారి అంజిప్రసాద్ రైతులతో అన్నారు. శనివారం సాయంత్రం ఆయన మాటేగాం రైతులతో మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గంలో 900 నుంచి 1000 ఎకరాల వరకు నకిలీ, నాసిరకం సోయా విత్తనాల వల్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. భైంసాలోని పలు గ్రామాల్లో నకిలీ సోయా విత్తనాల వల్ల రైతులు నష్టపోయారని, పూర్తి ఆధారాలతో రైతులు వినియోగదారుల ఫోరంను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి గణేశ్, రైతులు ఉన్నారు.