ఎదులాపురం, జూలై 2 : నూతనంగా ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి విభాగం, పీసీఆర్, పొక్సో చట్టం అమలుపై బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాక్ట్‌కు సంబంధించిన అంశాలపై నూతన కమిటీ సభ్యులకు విసృ్తత సూచనలు చేశారు.
కమిటీ నూతన సభ్యులుగా శశికాంత్, లక్ష్మీకాంత్, ఉషారాణి, జంగు బాపు, శ్యామల నియమితులు కాగా వారికి అభినందనలు తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన సభ్యుల పదవీ కాలం రెండేండ్లు ఉంటుందన్నారు. నిరంతరం గ్రామాల్లో పర్యటించి ఎస్సీ, ఎస్టీ సమాజానికి మంచి చేసేలా కార్యక్రమాలు చేపట్టాలని పేరొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, ట్రెయినీ కలెక్టర్ సలోని, సబ్ కలెక్టర్ యువరాజ్, డీఎస్సీడీవో భగత్ సునీత కుమారి, తదితరులు పాల్గొన్నారు.