ఎదులాపురం, ఆగస్టు 13 : ఆదిలాబాద్ రూ రల్ మండలంలో మంగళవారం కలెక్టర్ రాజ ర్షి షా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. తంతో లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారుల కోసం వండిన అన్నాన్ని రుచి చూశారు.
చిన్నారుల బరువు, ఎత్తును సక్రమంగా కొలవాలని అం గన్వాడీ టీచర్ను ఆదేశించారు. అలాగే సమీపంలోని చౌక ధరల దుకాణాన్ని పరిశీలించా రు. అనంతరం ఇందిరా మహిళా శక్తి ద్వారా రుణం తీసుకుని కిరాణం షాప్ నడుపుకుం టూ ఉపాధి పొందుతున్న మహిళ లబ్ధిదారు ను వ్యాపారం ఎలా నడుస్తుంది వంటి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు.
విద్యార్థులతో ముచ్చటిస్తూ పాఠాలు చదివించారు. పైప్లైన్ లీకేజీ అవుతున్నదని, విద్యుత్ తీగలు సరిచేయాలని, అంగన్వాడీ భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరారు. ఇంటింటి ఫీవర్ స ర్వే ఎంతవరకు చేశారని ఏఎన్ఎం, ఆశ వరర్లును అడిగి తెలుసుకున్నారు. జ్వరం ఉన్న వారికి రక్త పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి నాగభూషణం, తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.